అత్యంత పటిష్ట భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావేర్ విల్మింగ్టన్లోని నివాసం నో ఫ్లై జోన్లోకి పౌర విమానం శనివారం ప్రవేశించి చక్కెర్లు కొట్టింది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించి విమానం ప్రవేశించడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ విమానాన్ని ఫైటర్ జెట్లు వెంబడించినట్టు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.