రాప్తాడు మండలంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదివారం ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. 90 రోజుల పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరినీ పరిశీలించి వెంటనే పట్టాలు అందించాలన్నారు.