వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.8.97కోట్లు మంజూరయ్యాయని ఆలయ అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కొండ శిఖరంపై కొలువై ఉన్న మహాలక్ష్మి ఆలయ జీర్ణోదరణ పనుల కోసం రూ. 5 కోట్ల, కొండపై రక్షణ గోడ నిర్మాణం కోసం 2. 4 కోట్లు అన్నప్రసాద భవనం విస్తరణ, ఆధునీకరణ కోసం 80 లక్షల భక్తుల క్యూలైన్ ఏర్పాటు కోసం రూ.77 లక్షల వినియోగిస్తామన్నారు.