కందుకూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ తాగనీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం కందుకూరు డివిజన్ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఇంతకాలం సొంత భవనం లేకుండా పంచాయతీరాజ్ కార్యాలయం భవనంలో కొనసాగుతున్న ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ కార్యాలయానికి సొంత భవనం ఏర్పడడం సంతోషదాయకమని, ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ శాఖకు ఏర్పాటైన తొలి స్వంత కార్యాలయ భవనమని ఎమ్మెల్యే అన్నారు.