స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం అయింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. బెయిల్‌కు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని పిటిషన్ వేశారు.