కందుకూరులోని గ్రామదేవత అంకమ్మ తల్లి ఆలయానికి అదనపు శోభను చేకూర్చే విధంగా 4 కోట్ల వ్యయంతో చేపట్టిన అనివేటి మండపం నిర్మాణ పనులను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 47 అడుగుల వెడల్పు 57 అడుగుల పొడవుతో ఏర్పడనున్న అనివేటి మండపం అద్భుతమైన రాతి శిల్పాకృతులతో అంకమ్మ తల్లి ఆలయానికి ఎంతో శోభను చేకూరుస్తుందని మహీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.