దేశ విభజనను దేశ చరిత్రలో పెద్ద తప్పిదంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. గతంలో కాంగ్రెస్ పాలకులు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికీ భారతదేశం చాలా నష్టపోతున్నదని అన్నారు. ఇప్పుడు రద్దు చేయబడిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి చెందకుండా ఉంచిందని, వేర్పాటువాదానికి బీజాలు నాటిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్ (పీవోజేకే) భారతదేశంలో భాగమై ఉండేదని గుర్తు చేశారు.