గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కుదరదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అంటే హమాస్ టెర్రరిస్టులకు లొంగిపోవడమేనని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. 'కాల్పుల విరమణ అనేది జరిగే విషయం కాదు. యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్ పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేయాలని తెలిపారు .