ఉత్తరప్రదేశ్లోని బండా నియోజకవర్గ మాజీ బీజేపీ ఎంపీ భైరాన్ ప్రసాద్ మిశ్రా కొడుకు ప్రసాద్ మిశ్రా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్ మిశ్రాను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ బెడ్ ఖాళీగా లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన గంటసేపటికే అతడు మరణించాడు. దాంతో ఆగ్రహించిన ప్రసాద్ విశ్రా ఆస్పత్రిలో ధర్నా నిర్వహించారు.