జి. సిగడాం మండలం సంతవురిటి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సందర్శించారు. ముందుగా శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి, వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ప్రజలు ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.