మడకశిర పట్టణంలో మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎస్ ఐ లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వర కళాశాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు రన్నింగ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ రన్నింగ్ వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.