కళ్యాణదుర్గo మండలం పాలవాయి గ్రామం నందు జరుగుతున్నటువంటి రీసర్వే పనులను కళ్యాణదుర్గం ఆర్డిఓ రాణి సుస్మిత మంగళవారం పర్యవేక్షించారు. కళ్యాణదుర్గం డివిజన్ లో రీ సర్వేకు సంబందించి ఫేజ్-3 నందు 52గ్రామాలు తీసుకున్నారు. అందులో 9 గ్రామాలు రీ సర్వే పూర్తి అయింది. ఆర్డీవో పాలవాయి గ్రామాన్ని తనిఖీ చేసి రీసర్వే పనులను వేగవంతం చేస్తూ ప్రభుత్వం వారు ఇచ్చిన తేది లోగా పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.