జిల్లా సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైల్వే ప్రమాద క్షతగాత్రులను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, మృతులకు ఎక్స్గ్రేషియోను తక్షణమే విడుదల చేయాలని భువనేశ్వరి కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని కోరారు. ఆమెతో పాటుగా ఎస్. కోట మాజీ టిడిపి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.