తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కొందరు విపక్ష ఎంపీలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం స్పందించింది. యాపిల్ సంస్థ సుమారు 150 దేశాల్లో వార్నింగ్ నోటీఫికేషన్లు జారీ చేసిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ అలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు.