రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని ఎస్సీ గ్రామాలలో స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపుపై ప్రత్యేకతలు చూపాలని జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో హేలా షారోన్ కు వినతిపత్రం అందజేశారు. రేపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలలో స్మశాన వాటిక కొరకు ఎస్సీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో జై భీమ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు దోవా రమేష్ రాంజీ పాల్గొన్నారు.