భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని థాయ్‌లాండ్ నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్‌లాండ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. తాజాగా భారత్, తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించొచ్చని తెలిపారు. ఈ ఏడాది 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.