రాజమండ్రిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు పెట్టారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ... బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కూడా ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు. జైలుకు 3 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టడం దారుణమన్నారు. జైలు వద్దకు రాకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదన్నారు. అభిమాన నేతను చూసేందుకు వేల మంది తరలివచ్చారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa