రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేననిటీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. '53 రోజులపాటు ఎంతో వేదన చెందా. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచింది. తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట ఇచ్చింది. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారు. రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలి.' అని అన్నారు.