నగరంలోని గాలి నాణ్యత సూచిక క్షీణించడంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రం, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల వివరణలు కోరింది. ''నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియజేయాలి'' అని కోర్టు పేర్కొంది.