రాష్ట్రాలకు స్వయంపరిపాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో భారత్ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా అనే పేరుతో ఆయన మూడో విడత వీడియో ప్రసంగాన్ని మంగళవారం విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాలకు స్వయంపరిపాలన కావాలంటూ ఘోషించిన మోదీ, ప్రధానమంత్రి అవ్వగానే ఆ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్టాలిన్ వెల్లడించారు.