రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం చంద్రబాబు కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసి భావోద్వేగానికి గురి అయ్యారు. వారికి ఓదారుస్తూ చంద్రబాబు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతా మంచే జరుగుతుందని దైర్యంగా ఉండాలని సూచించారు.