నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను ప్రార్ధిస్తున్నాను." అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.