ఏపీలోని పెనుగొండ పట్టణంలో మహిళ దారుణ హత్యకు గురైంది. రాంప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న నందిని(25) ని భర్తే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వీపు పై కత్తి పోట్లు ఉన్నాయి. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు పడుతున్నట్లు తెలిసింది. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.