ఓటర్ల జాబితాలో వృద్ధుల వయస్సు, డోర్ నెంబర్ల విషయంలో పొరపాట్లు చోటు చేసుకుంటే రెండు వారాల్లో వాటిని సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎలాక్టోరల్ పనులన్నీ నిబంధన మేరకు పూర్తి చేయాలని ఎన్నికల అధికారి ఆదేశించారు.