రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు పొట్టి శ్రీరాములు. పాతికేళ్ల వయసులోనే భార్య మరణించడంతో తన జీవితాన్ని దేశానికే అంకితం చేయాలని నిశ్చయించారు. 1912లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన రాగా.. ఆయన 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. 58 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణ త్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచింది.