చంద్రబాబుకు కళ్లు కనిపించడం లేదని, కంటి ఆపరేషన్ జైల్లో చేయలేరు కాబట్టే మధ్యంతర బెయిల్ వచ్చిందని, కంటి ఆపరేషన్ తరువాత చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అనారోగ్య కారణాలతో గౌరవ న్యాయస్థానం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. దానికి న్యాయం గెలిచిందని టీడీపీ హంగామా చేస్తుందన్నారు. ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని, ఇంకా నిజం గెలవలేదు.. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, వచ్చే ఎన్నికల్లో ముందో, తరువాతో ఏపీలోనూ జెండా పీకేస్తారన్నారు.