కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం మాత్రమే చంద్రబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. గడువు ముగిసిన తరువాత బాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబుకు కోర్టు ఇచ్చింది కండీషనల్ బెయిల్ మాత్రమేనని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరుపై టీడీపీ నానా హంగామా చేస్తోందని, తిరిగి చంద్రబాబు జైలుకు వెళ్లక్కతప్పదన్నారు. ఇన్ని రోగాలు ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అవసరమా..? అని ప్రశ్నించారు.