కావేరి జలాల నిర్వహణ ప్రాధికార ఆదేశాల మేరకు తమిళనాడుకు నీటి విడుదలను నిరసిస్తూ మండ్య జిల్లా రైతు హిత రక్షణ సమితి సారథ్యంలో రైతు సంఘాల సమాఖ్య 56 రోజులుగా చేస్తున్న సత్యాగ్రహ ప్రాంగణాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య మంగళవారం సందర్శించారు. రైతుల న్యాయ సమ్మతమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర జలవనరులశాఖ రాష్ట్ర రైతాంగం సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.