ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వేసిన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారం దర్యాప్తులో ఉండగా.. ప్రజాధనం దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చార్జి షీట్ దాఖలు చేయకుండా, విచారణ ముగియక ముందే ఇలా చేయటం ద్వారా ప్రజా ధనం వృధా అయిందని న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని న్యాయస్థానం కోరింది. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వడంలేదని లాయర్ తెలిపారు. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేయాలని హైకోర్టు సూచిస్తూ.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.