ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో బాగంగా చంద్రుడి కక్ష్యలోకి వ్యోమనౌక చేరిన విషయం తెలిసిందే. ఈ ప్రాసెస్ లో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయింది. అయితే ప్రొపల్షన్ మాడ్యుల్ మాత్రం న్యూక్లియర్ టెక్నాలజీని వాడుకొని అవసరమైన శక్తిని పొంది చంద్రుడి కక్ష్య చుట్టూ ఇప్పుడు తిరుగుతోందని అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ అజిత్ కుమార్ మెహంతి తెలిపారు.