ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం దాడులు చేశారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కేబినెట్ మంత్రి, ఆప్ నేత రాజ్‌కుమార్ ఆనంద్ నివాసంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఆనంద్‌కు హవాలా లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.