ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు తాను హాజరుకావడం లేదని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాదు, తనకు జారీ చేసిన సమన్లు వాపస్ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో చట్టవిరుద్ధంగా జారీ చేసిన నోటీసులని అన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే సమన్లు పంపారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా నవంబరు 2న హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు గతంలో సమన్లు జారీ చేశారు.