ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్తితుల కారణంగా గాజాలో జరుగుతున్న యుద్ధానికి స్వల్ప విరామం అవసరమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ఆయన ఇలా స్పందించడం విశేషం. బుధవారం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఖైదీలను బయటకు క్షేమంగా తెచ్చేందుకు ఆ విరామం కచ్చితంగా అవసరమన్నారు.