ఉరవకొండ పట్టణంలోని స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబా వారికి ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కాకడ హారతి, అష్టోత్తర కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో బాబా వారి ఫోటోను, పాదుకలు ఉంచి పల్లకిసేవ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.