బాపట్ల పట్టణంలోని శీలం వారి పాలెం సచివాలయం పరిధి భీమ వారి పాలెం బోర్డు హైస్కూల్లో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి ప్రారంభించారు. సుమారు 400 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్యులకు, వివిధ శాఖల సిబ్బందికి ఎమ్మెల్యే కోన సర్టిఫికెట్లు అందించి అభినందించారు.