నెల్లూరు జిల్లాలో ‘‘సైకో పోవాలి... సైకిల్ రావాలి’’ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారని పోలీసులు కేసులు నమోదుచేశారు. చంద్రబాబు విడుదల సందర్భంగా జలదంకిలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉండగా ఎస్ఐ ఆదిలక్ష్మీ అటకాయించారు. వైసీపీ వారు ఏమి చేసినా తప్పులేదని... తాము మిఠాయిలు పంచితే తప్పా? అని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రశ్నించారు. ఎస్ఐ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేనితో సహా 30 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. 143, 149, 186, 188, 341, 353, 506 ఐపీసీ సెక్షన్ల టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.