టీడీపీ నేత ఎర్రంనాయుడు ప్రజల మనిషి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. గురువారం దివంగత టిడిపి నేత ఎర్రంనాయుడు 11వ వర్ధంతి సందర్భంగా ఎంపీ రామ్మోహన్నాయుడు, టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ.. ఎర్రన్న ఉత్తరాంధ్రలో పుట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎర్రన్న పేరును రామ్మోహన్ నాయుడు నిలబెడుతున్నారని మాజీ మంత్రి కొనియాడారు.