బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం నుంచి అద్దంకి వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. రహదారి వెంబడి చెట్లు దట్టంగా పెరగటంతో మలుపులు వద్ద ఎదురు వచ్చే వాహనాలు కనపడక వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో మలుపులు ప్రమాదకరంగా మారాయి అని పలువురు వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.