పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్కాపురం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తోకపల్లి వద్ద కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా ఆటో డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రాజకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.