ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలోని పొగాకు పొలాలలో గురువారం 8 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. అటువైపు వెళుతున్న స్థానిక రైతులు ప్రజలు కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు కొండచిలువను బంధించి సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానిక రైతులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.