ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న సోమశేఖర్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి స్వగ్రామమైన రాచర్ల మండలం పలుగుంటిపల్లిలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.