టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పారు. వన్డే చరిత్రలోనే ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 1000కి పైగా పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు 8 క్యాలెండర్ ఇయర్స్ లో అతడు 1000కి పైగా రన్స్ పూర్తి చేశారు. కోహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ (7) ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సౌరల్ గంగూలీ (6), సంగక్కర (6), రికీ పాంటింగ్ (6), రోహిత్ శర్మ (4) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa