రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాస్ర కుమారులు అభిలాశ్, అవినాశ్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. గోవింద్ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకేజ్ కేసులో విచారణకు ఈ నెల 7, 9 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. గత నెల 26న వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హుడియాపై కూడా ఈడీ దృష్టి సారించింది.