వచ్చే ఐదేండ్లు కూడా తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తానే సీఎంగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. కర్ణాటక కాంగ్రెస్లో ‘సీఎం కుర్చీలాట’ మొదలైందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రెండున్నరేండ్ల తర్వాత సిఎంని మారుస్తారన్న వార్తలను కొట్టిపారేశారు. సిఎం వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడుతానన్నారు.