రాష్ఠ్రంలో ఏ ధరలు పెరిగినా అవి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయనేది ప్రజలు గుర్తించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జైలు నుంచి వచ్చిన బాబుకు నిజాయితీ గెలిచిందని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. 2014లో మహిళలందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే రుణాలన్నీ మాఫీ చేస్తానని మోసం చేసాడని, తర్వాత మళ్లీ అవకాశం ఇవ్వమని అడిగాడని గుర్తు చేసారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తాడన్నారు. గతంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులకు వెళ్లవారని, ఇప్పుడు పేదల అవసరాలను ప్రభుత్వం తీరుస్తుంటే కోర్టుకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో చాలా ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచలేకపోయాయని, . సీఎం జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్యంగా జీవన ప్రమాణాలు పెంచారని వివరించారు. . స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా జీవన ప్రమాణాలు పెరగడం జగన్ పాలనలోనే సాధ్యమవుతోందన్నారు. ప్రజల నుంచి వచ్చిన నాయుకుడు జగన్ సమాజంలో అనేక మార్పులు తెచ్చి ప్రతీ కుటుంబానికి గౌరవం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకేశ్ వంటి సైకోలు అవగాహన లేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వర్గీయ వైఎస్ ప్రజల కోసం ఒక్క అడుగు వేస్తే, మరో ముందుడుగు జగన్ వేస్తున్నారని వివరించారు. మరో 20 ఏళ్లు ఇలాంటి పాలన సాగితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెంది తిరుగులేని విధంగా సాగుతుందనడంలో సందేహం లేదన్నారు. స్పష్టమైన ఆలోచనలతో ప్రజాస్వామ్యయుతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం ఆత్మాభిమానం చంపుకోకుండా బ్రతకాలన్నదే జగన్ ఆశయమని గుర్తుచేసారు.