నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రంగానే ఉంటుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రకటించారు. జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారణమైనవని, వాటిని ఎవరు నమ్మవద్దని సూచించారు.. అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్న ఆయన.. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండకూడదని కొంత మంది దురుధ్యేశ్యంతో విష ప్రచారం చేస్తున్నారు… కొంత మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా మాద్యమాలు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నే జిల్లా కేంద్రంగానే ఉంటుందని స్పష్టం చేశారు.