చంద్రబాబునాయుడు కండీషన్ బెయిల్ పై విడుదల కావడంతో అత్యుత్సాహంలో ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో సభ్యసమాజం తలదించుకునేలా పొట్టేళ్లు నరికారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం అన్నారు. చంద్రబాటు చిత్రపటానికి పొట్టేళ్ల రక్తం చిందించడంపై ఆయన స్పందిస్తూ అభిమానం ఉంటే పూజలు, అన్నదానం లాంటివి చేయాలని, ఇలా మూగజీవాలను బలిచేసి అనాగరికంగా ప్రవర్తించకూడదని అన్నారు.