మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్న చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన మద్దిలేటి (63) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని స్నేహలత ఆసుపత్రి ముందు బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు మాట్లాడుతూ. వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోగా, ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోగా చికిత్స మొదలు పెట్టిన 15 నిమిషాల్లో ప్రాణాలు వదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు.