ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం పి. కొత్తపల్లి గ్రామంలో 24 మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.