అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపేటలో నివాసముంటున్న చాకలి నారాయణమ్మ శుక్రవారం ఉదయం 03: 30 గంటల సమయంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. చాకలి నారాయణమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై నిందితుడు భర్త చాకలి నాగరాజు(45) చెక్కతో కొట్టిన తక్షణమే మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహమైనట్టుగా తెలుస్తోంది. ఇంకా పిల్లలు లేరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.